‘బాల్క సుమన్‌ను నిందించడం సరికాదు’

MLA Korukanti Chander Slams EX MLA Somarapu Satyanarayana - Sakshi

సోమారపుపై ఎమ్మెల్యే చందర్‌ ఫైర్‌

సాక్షి, పెద్దపల్లి : రామగుండం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. సోమారపుతోపాటు ఆయన అనుచరులు కూడా పార్టీని వీడారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమి కోసం చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పనిచేశారని ఆరోపించారు. కాగా సత్యనారాయణ ఆరోపణలపై రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవకాశవాద రాజకీయాలు చేస్తూ పార్టీని దిగజార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఓటమికి కారణం బాల్కసుమన్‌ అనడం సరికాదని హితవు పలికారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్‌ఎస్‌ నాయకులను సత్యనారాయణ అణదొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వయసు పెరిగేకొద్దీ ఆయన బాలఖాళిలోకి వెళ్తున్నారని చురకలంటించారు. కొడుకుని రాజకీయాల్లోకి తెచ్చేందుకే సత్యనారాయణ పార్టీని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో కూడా ఆయన టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపించారు.  టీఆర్‌ఎస్‌ పార్టీ ఆయనకు సముచిత న్యాయం చేసిందన్నారు. 

(చదవండి : టీఆర్‌ఎస్‌కు సీనియర్‌ నేత గుడ్‌ బై)

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top