‘నూకలు చెల్లినయ్‌.. ఆ పార్టీని తరిమేయాలి’

Minister Jagadish Reddy Slams Congress Party At Narketpally - Sakshi

సాక్షి, నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల మాదిరే తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించబోతోందని విద్యాశాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి జోస్యం చెప్పారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీ అభ్యర్థి బండ నరేందర్‌ భారీ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం శబరి గార్డెన్స్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. జిల్లా కాంగ్రెస్‌ నాయకుల చేతకానితనం వల్లనే ఫ్లోరైడ్‌ సమస్య, కరువు విస్తరించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మరోసారి టీఆర్‌ఎస్‌ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్‌ పార్టీకి నూకలు చెల్లినయ్‌, జిల్లా నుంచి కాంగ్రెస్‌ను తరిమేయాలి’ అని అన్నారు. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జడ్పీ చైర్మన్‌ పీఠాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top