‘దుక్కలా ఉండి పెన్షన్‌ అడుగుతారా’

Minister Ayyanna Patrudu Controversial Comments On Widows - Sakshi

మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై మహిళలు సీరియస్‌

సాక్షి, విశాఖ : ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు మహిళల గురించి అసభ్యంగా మాట్లాడారు. విశాఖ జిల్లాలోని బుచ్చయ్యపేట మండలం చిన్నపాలెంలో గురువారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో వితుంతు మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘భర్త చనిపోయినవారికి పెన్షన్‌ అడిగితే సరేగాని.. దుక్కలా ఉండి పెన్షన్‌ కావాలంటే ఎలా? ఊళ్లలో కొంతమంది మహిళలు తమ భర్త లేడు. పెన్షన్‌ కావాలంటారు. ఉన్నాడా.. పోయాడా అంటే చెప్పరు. పదేళ్లుగా జాడ లేదని చెప్తారు. అలాంటి వారికి పెన్షన్‌ ఎందుకు ఇస్తాం. ఎక్కడి నుంచి ఇస్తాం. భర్తలను మీరు (వితంతువులు) రాచి రంపాన పెడితేనే వారు పారిపోయారు’ అని దిక్కుమాలిన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై మహిళలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత గల పదవిలో ఉండి ఇంత నీచంగా మాట్లాడుతారా అని తిట్టిపోస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top