బాబు మాటలను నమ్మవద్దు

Meda Malli Karjuna Reddy Slams Chandrababu naidu - Sakshi

మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి

వైఎస్‌ఆర్‌ జిల్లా, సుండుపల్లె: డ్వాక్రా మహిళలను మోసం చేయడానికి చంద్రబాబు మళ్లీ చెక్కులపేరుతో కుట్రపన్నారని రాజంపేట మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఆరోపించారు. సుండుపల్లె మండలంలో జీకే రాచపల్లెలో వివాహ వేడుకలకు ఆయన హాజరయ్యారు. అదేవిధంగా బెస్తపల్లి, పింఛా, పొలిమేరపల్లె పలుప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోస్ట్‌డేటెడ్‌ చెక్కులను మూడు విడతలుగా ఇస్తామనడంలో వారి బండారం బయటపడుతోందని ఎద్దేవా చేశారు.  ఇది మహిళలను బురిడీకొట్టించడానికే తప్పా దేనికీ పనికిరాదు.   అబద్ధపు మాటలు, మోసాలు చేయడం బాబుకు అలవాటని విమర్శించారు.  నిత్యం ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్న టీడీపీ  ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలన్నారు. అందరితో కలసిమెలసి 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు.

ఆర్థికసాయం: పొలిమేరపల్లి గ్రామపంచాయతీ చిన్నరెడ్డిగారిపల్లెకు చెందిన రవి అనే యువకుడు పెరాలసిస్‌తో భాధపడుతుండటంతో మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఆస్పత్రి ఖర్చులకుగానూ రూ.5వేలు ఆర్థికసాయం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top