ఓటర్ల జాబితా లేకుండానే ఎన్నికలకు ఏర్పాట్లా? | Marri Shashidhar Reddy questioned the CM | Sakshi
Sakshi News home page

ఓటర్ల జాబితా లేకుండానే ఎన్నికలకు ఏర్పాట్లా?

Jan 19 2018 1:13 AM | Updated on Aug 15 2018 8:12 PM

Marri Shashidhar Reddy questioned the CM - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల జాబితా లేకుండానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎలా ప్రకటిస్తారని మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ప్రశ్నించారు. ఓటర్ల జాబితాను వెలువరించిన తర్వాత ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు చేయాలని అన్నారు.

గురువారం    విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందుగానే ఓటర్ల జాబితా ప్రకటించాలన్నారు. ముఖ్యమంత్రి కుట్రపూరితంగా వ్యవహరిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా లేనివారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు.    

Advertisement
 
Advertisement
Advertisement