సీఈసీ పనిని కేసీఆర్‌ ఎలా చెప్తారు? | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 8 2018 1:26 AM

Marri Shashidhar Reddy Fires On KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అసెంబ్లీ రదై్దన నేపథ్యంలో నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఎన్నికల సంఘం చేయాల్సిన పనిని కేసీఆర్‌ ఎలా చెబుతారని ప్రశ్నిస్తూ మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషనర్‌ ఓం ప్రకాశ్‌ రావత్‌కు లేఖ రాశారు. తనతోపాటుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడారని చెప్పిన కేసీఆర్‌ ప్రసంగం యూట్యూబ్‌ లింక్‌నూ సీఈసీకి పంపారు. ఆ నాలుగు రాష్ట్రాలతో పాటే ఎన్నికలు జరుగుతాయని, షెడ్యూల్‌ ఇలా ఉంటుందన్న కేసీఆర్‌ వ్యాఖ్యలు ఈసీ స్వతంత్రత, నిజాయితీపై సందేహం కలిగించేలా ఉన్నాయన్నారు.

నవంబర్‌లో ఎన్నికలపై సందేహం..
ఎన్నికల సంఘం చేయాల్సిన పనిని చెప్పిన కేసీఆర్‌ వ్యాఖ్యలు నిజమో కావో నిర్ధారించాలని, లేదంటే తాము ఎన్నికల పవిత్రతను కాపాడేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని ఆ లేఖలో శశిధర్‌రెడ్డి వెల్లడించారు. ఓటర్ల జాబితా సవరణ వచ్చే ఏడాది జనవరిలో పూర్తి కావాల్సి ఉండగా, నవంబర్‌లోనే తెలంగాణ శాసనసభకు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని సందేహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement