కేసీఆర్‌ ఓ తాగుబోతు సీఎం: మర్రి శశిధర్‌రెడ్డి

Marri seshidar reddy commented over kcr - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై కాంగ్రెస్‌ సీనియర్‌నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ ఓ తాగుబోతు ముఖ్యమంత్రి అని, కాంగ్రెస్‌ను తిట్టాలనుకుంటే ఓ పెగ్గు ఎక్కువేసుకుని వస్తాడన్నారు. తెలంగాణకు ఇలాంటి తాగుబోతు సీఎంగా ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టమన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పు డు జరుగుతాయో తేదీలతో సహా కేసీఆర్‌ చెప్పడాన్ని చూస్తే ఆయనతో ఎన్నికల సంఘం అధికా రులు కుమ్మక్కయ్యారన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top