
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తమ పార్టీకి అధికారం ఖాయమని కాంగ్రెస్ మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ (చార్మ్స్) నిర్వహించిన సర్వే లో తేలిందని టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్ మదన్‌మోహన్ తెలిపారు. అసెంబ్లీ రద్దు అనంతరం ముందస్తు ఎన్నికలపై చార్మ్స్ బృందం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా శాంపిల్స్ సర్వే నిర్వహించిందన్నారు.
మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చార్మ్స్ సౌకర్యం ద్వారా బుధవారం బూత్ స్థాయి అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు చెప్పా రు. ఢిల్లీ కార్యాలయం నుంచి రాహుల్ నేరుగా టెలి కాన్పరెన్స్‌లో మాట్లాడతారని చెప్పారు.