‘ఉద్యోగాల భర్తీ చేసేవారికే మా మద్దతు’ | Krishnaiah about support to political parties | Sakshi
Sakshi News home page

‘ఉద్యోగాల భర్తీ చేసేవారికే మా మద్దతు’

Oct 24 2018 2:37 AM | Updated on Oct 24 2018 2:37 AM

Krishnaiah about support to political parties - Sakshi

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేసే వారికే తమ మద్దతు ఉంటుం దని తెలంగాణ నిరుద్యో గ సంఘం స్పష్టం చేసిం ది. విద్యానగర్‌లో మంగళవారం జరిగిన బీసీ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశానికి బీసీ సంఘం నేత, టీటీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్యతో పాటుగా తెలంగాణ నిరుద్యోగ సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కిరణ్‌ను నియమిస్తూ నియామక పత్రాన్ని కృష్ణయ్య అందజేశారు.

అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగున్నర ఏళ్ల పాలనలో 18వేల ఉద్యోగాల ను మాత్రమే భర్తీ చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 40 వేల టీచర్‌ పోస్టుల తోపాటుగా ప్రభుత్వ జూనియర్, డీగ్రీ, వర్సిటీ ల్లో ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులకు నోటిఫి కేషన్‌ జారీ చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు టీఆర్‌ చందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement