సాక్షి, గుంటూరు: పొన్నూరు సీఐ కృష్ణయ్య పచ్చ పైత్యం ప్రదర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై దాడులు చేయడంతో పాటు దురుసుగా ప్రవర్తించారు. గత పదిరోజులుగా ఇదే పంథాను సీఐ కృష్ణయ్య అనుసరిస్తున్నారు. దళిత నాయకుడు వరికూటి అశోక్ బాబుపై సీఐ రెచ్చిపోయారు. వరికూటి అశోక్ బాబును సీఐ కృష్ణయ్య, పోలీసులు ఈడ్చేశారు. దళిత నాయకుడు వరికూటి అశోక్ బాబును కిందపడేసిన పోలీసులు.. ఆయన పట్ల హేయంగా ప్రవర్తించారు.

మధ్యాహ్నం రేపల్లె ఇన్‌ఛార్జ్ పేట మోహన కృష్ణపై దాడిచేసిన సీఐ కృష్ణయ్య.. జీపులోకి ఈడ్చేసి కొట్టారు. గతంలో బీసీ మాజీ మంత్రి జోగి రమేష్ పట్ల ఇలానే సీఐ కృష్ణయ్య రెచ్చిపోయారు. జోగి రమేష్‌ను మామిళ్లపల్లి వెళ్లకుండా సీఐ అడ్డుకున్నారు. ప్రశ్నించిన జోగి రమేష్‌ను ఈడ్చికెళ్లారు. అంబటి మురళీకృష్ణ తోనూ దారుణంగా పోలీసులు ప్రవర్తించారు. అంబటి మురళీకృష్ణ, జూపూడి ప్రభాకర్‌లను ఇంట్లోనుండి పోలీసులు లాక్కెళ్లారు. ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ప్రాపకం కోసం సీఐ కృష్ణయ్య రెచ్చిపోతున్నారు.


