‘టీడీపీ నేతలు వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు’

Koyya Prasad Reddy Slams TDP Leaders Over ESI Scam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేతలు శ్రీనివాసరెడ్డి, పత్తిపాటి పుల్లారావు, పితాని సత్యారాయణలకు చంద్రబాబు సహాయకుడు శ్రీనివాసరావు అక్రమాస్తులతో సంబంధాలు ఉన్నాయని ఏపీ టెక్నాలిజీ మాజీ చైర్మన్‌ కొయ్య ప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు వైఎస్సార్‌సీపీ అయిదేళ్ల నుంచి చెబుతోందని తెలిపారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి ఈఎస్ఐ కుంభకోణంతో ప్రమేయం ఉందన్నారు. కానీ టీడీపీ నేతలు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. (ఏం బతుకులు మీవి..?: విజయసాయిరెడ్డి)

అచ్చెన్నాయుడు బీసీ నేత అని టీడీపీ నాయకులు వెనుకేసుకు వస్తున్నారని ప్రసాద్‌రెడ్డి విమర్శించారు. బీసీ నేతలను దోచుకోమని ఎవరైనా చెప్పారా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు దివాకర్ రెడ్డి, నారాయణ, పీలా గోవింద్ అక్రమాలు బయటకు వస్తే కక్ష సాధింపు అని టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. విశాఖలో రాజధానికి నేవి అనుమతి ఇవ్వడం లేదని అత్యంత దారుణంగా పచ్చ మీడియా ప్రచారం చేస్తోందని ఆయన దుయ్యబాట్టారు. (అక్రమాలపై విచారణకే ‘సిట్‌’)

టీడీపీ నేతలు పనిగట్టుకొని వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారని ప్రసాద్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలని భూసేకరణ జరుపుతుంటే.. బండారు సత్యనారాయణ లాంటి అక్రమార్కులు తప్పుడు ప్రచారంతో ప్రజలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. నదుల అనుసంధానం ద్వారా రైతులకు మేలు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారని ఆయన గుర్తు చేశారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశిస్తే రేషన్ కార్డులు తొలగిస్తున్నారని టీడీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. ఈఎస్ఐ స్కాంలో కాంట్రాక్టర్ లోకేష్‌కు అత్యంత ఆప్తుడని ప్రసాద్‌రెడ్డి తెలిపారు. (రోగుల అందం.. అదిరిందయ్యా చంద్రం!)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top