హిందూ దేశంగా మార్చాలని చూస్తున్నారు  | Komatireddy Venkat Reddy fire on Narendra Modi | Sakshi
Sakshi News home page

హిందూ దేశంగా మార్చాలని చూస్తున్నారు 

Nov 13 2018 3:22 AM | Updated on Mar 18 2019 9:02 PM

Komatireddy Venkat Reddy fire on Narendra Modi - Sakshi

నల్లగొండ: దేశాన్ని ప్రధాని  మోదీ హిందూ దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నల్లగొండలో ముస్లింలతో కలసి భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన ఎన్నికల సభలో కోమటిరెడ్డి మాట్లాడుతూ మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ ఒకటేనని ఆరోపించారు. మోదీ, కేసీఆర్‌ ప్రభుత్వాల కాలంలో మైనార్టీలకు అన్యాయం జరిగిందన్నారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ముస్లింలకు 4 శా తం రిజర్వేషన్లు కల్పించడంతో ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement