‘నల్గొండలో ఒక్కసీటు గెలిచినా రాజకీయ సన్యాసం’

Komatireddy Rajagopal Reddy Challenge TRS Over Elections - Sakshi

12 సీట్లలో ఒక్కటి గెలిచినా రాజకీయాల నుంచి తప్పుకుంటా

టీఆర్‌ఎస్‌కు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సవాల్‌

సాక్షి, నల్గొండ : కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీకి సవాల్‌ విసిరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క స్థానంలో టీఆర్‌ఎస్‌ గెలుపొందినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగంగా కేసీఆర్‌ గురువారం అసెంబ్లీని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మునుగోడు నుంచే పోటీ చేస్తానని రాజగోపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు. కాగా, నల్గొండ (ఉమ్మడి) జిల్లాలో మొత్త 12 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2014 ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసిన రాజగోపాల్‌ రెడ్డి బూర నర్సయ్య గౌడ్‌ చేతిలో ఓడిపోయారు.

40 మందిని గెలిపించే సత్తా ఉంది..
తాను కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లడాన్ని కోమటరెడ్డి తప్పబట్టారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అందుకు సిద్ధంగా ఉందనే విషయాన్ని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

మునుగోడు నుంచి రాజగోపాల్‌ రెడ్డి, నల్లగొండ నుంచి తాసు పోటీ చేస్తానన్న కోమటిరెడ్డి.. ఈరోజు సాయంత్రం గం. 5.30ని.లకు ప్రచారం ప్రారంభిస్తానన్నారు. తాము గెలవడమే కాదు.. 40 మందిని గెలిపించే సత్తా తమకుందన్నారు.  కాగా, గెలవలేననే భయంతోనే సురేష్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్లారన్నారు. త్వరలోనే టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు రావడం ఖాయమన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top