
ప్రజలే ప్రాణంగా బతికే కోమటిరెడ్డి కుటుంబం నుంచి వస్తున్నా..
సాక్షి, నల్లగొండ : స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయని, తనను గెలిపిస్తే ప్రజాప్రతినిధుల హక్కులు సాకారం చేసేందుకు ప్రశ్నించే గొంతుకనవుతానని స్థానిక సంస్థల నల్లగొండ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మీరాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మీ ఆడబిడ్డగా ఆదరించి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ప్రజలే ప్రాణంగా బతికే కోమటిరెడ్డి కుటుంబం నుంచి వస్తున్నానని తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు పోటీలో నిల్చున్నానని పేర్కొన్నారు. సేవాభావంతో బతికే కుటుంబం తమదని తెలిపారు. వృద్ధుల సంక్షేమం కోసం జనగామలో ఎక్కడా లేనిరీతిలో వృద్ధాశ్రమాన్ని నిర్మిస్తున్నామని వివరించారు. ఈ నెల 31న మీ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై వేసి మీ ఆడబిడ్డగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నట్టు ఆమె పేర్కొన్నారు.