
సాక్షి, యాదాద్రి/వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ పార్టీ నాయకులు తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన యాదాద్రి జిల్లా భువనగిరిలో, వరంగల్‌లో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు.
తనకు ఉన్న గన్‌మెన్‌లను ఉప సంహరించడంతో హత్యకు కుట్ర జరుగుతోందన్న అనుమానం కలుగుతుందని చెప్పారు. తనను అడ్డుకునేందుకే అత్యంత సన్నిహితుడైన బొడ్డుపల్లి శ్రీనును హత్య చేశారని చెప్పారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను శాసనసభలో, బయట ప్ర«శ్నిస్తున్నందుకే తనపై కక్షగట్టి అంతం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఒకవేళ తనకేమైనా జరిగితే ప్రజలు ప్రగతి భవన్, కేసీఆర్ ఫాంహౌజ్‌ను నేలమట్టం చేస్తారని హెచ్చరించారు.