
సాక్షి, హైదరాబాద్ : కరెంట్ చార్జీలు పెంచిన రోజు నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం ప్రారంభమవుతుందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఎంపీ మాట్లాడుతూ.. తమ కమీషన్ల కోసం జెన్‌కోను నష్టాల బాట పట్టించారని మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన తప్పుల భారాన్ని ప్రజలపై రుద్దితే సహించమని హెచ్చరించారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిని ప్రజా ఉద్యమంలో భాగస్వాముల్ని చేస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. (గత రిలేషన్‌షిప్‌పై దీపిక సంచలన వ్యాఖ్యలు)