రాజకీయ ప్రచార అస్త్రాలుగా సర్వేలు | Sakshi
Sakshi News home page

రాజకీయ ప్రచార అస్త్రాలుగా సర్వేలు

Published Wed, Sep 19 2018 2:11 AM

Kodandaram on election surveys - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల్లో సర్వేలు రాజకీయ ప్రచార అస్త్రాలుగా మారాయని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎం.కోదండరాం వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ సర్వే అనేది స్టిల్‌ పిక్చర్‌ (ఫొటో) వంటిదన్నారు. సర్వే చేసినప్పటి పరిస్థితిని, సర్వే చేసినవారి అవసరాలు, సామర్థ్యం, పరిమితులకు లోబడి ఫలితం ఉంటుందన్నారు. గతంలో పంచాంగాలు, ముహూర్తాలు, గ్రహచారం అంటూ ఓటర్లను ప్రభావితం చేసుకోవడానికి రాజకీయ పార్టీల నేతలు యత్నించేవారని గుర్తుచేశారు.

ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో సర్వేలతో ప్రజలను, ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సర్వేలకోసం విపరీతంగా డబ్బులు కురిపించి, తమకు అనుకూలంగా చెప్పిం చుకుంటున్నారని అన్నారు. సర్వేలను టీఆర్‌ఎస్‌ రాజకీయ అస్త్రంగా మార్చుకుంటున్నదని ఆరోపించా రు. ఇలాంటి సర్వేలను నమ్మాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రం నిర్బంధంలో ఉందన్నారు. ఇప్పుడు అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఓట్లకోసం ప్రచారానికి వెళ్తే‡ ఐదేళ్లలో ఏం చేశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత బాగా ఉందన్నారు.

పొత్తులపై చర్చలు, సంప్రదింపులు
 పొత్తుల విషయంలో అనేక చర్చలు, సంప్రదింపులు ఉంటాయని కోదండ రాం అన్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించాలని, ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పా టు లక్ష్యంగా పొత్తుల్లో ఉమ్మడి ఎజెండా, అభ్యర్థుల గెలుపు, సమష్టి ప్రయోజనాలు వంటి అనేక అంశాలు ఉంటాయన్నారు. ఇలా లేకపోతే కలయికకు అర్థం ఉండదన్నారు. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ఉంటుందన్నారు. మిర్యాలగూడలో ప్రణయ్‌ హత్య దారుణమన్నారు. దానిలో అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్టు ప్రచారం జరుగుతోందన్నారు.

ప్రణయ్‌ హత్యకేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. హత్యకు కారకులను, సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి పక్ష నేతలను చిన్న కేసుకు కూడా అరెస్ట్‌ చేస్తున్నారని కోదండరాం విమర్శించారు. అధికారపార్టీ నేతలపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. మం త్రుల ఫోన్లు ట్యాపింగ్‌ అవుతున్నాయని, ఇంకా ప్రతి పక్షనేతల ఫోన్లు కాకుండా ఉంటాయా అని ప్రశ్నించారు. కలిసొచ్చే అన్ని పార్టీలతో నడవాలని చూస్తున్నామన్నారు. మహాకూటమిలో చేరడానికి సిద్ధంగా ఉన్నవారిలో ఏకాభిప్రాయం, ఒక నిర్ణయం వచ్చిన తర్వాత పొత్తులకు దూరంగా ఉన్న సీపీఎం వంటి పార్టీతోనూ చర్చలు జరుగుతాయని చెప్పారు.

Advertisement
Advertisement