‘ఎంపీ టికెట్‌కు కేజ్రీవాల్‌ ఆరుకోట్లు డిమాండ్‌ చేశారు’

Kejriwal Demands Six Crore Rupees From My Father Says East Delhi Candidate Sun - Sakshi

కేజ్రీవాల్‌పై ఆప్‌ అభ్యర్థి కుమారుడి ఆరోపణలు

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఆప్‌ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వద్ద ఆరు కోట్ల రూపాయలను తీసుకుని టికెట్‌ ఇచ్చారని ఆప్‌ వెస్ట్‌ ఢిల్లీ లోక్‌సభ అభ్యర్థి బల్బీర్‌ జక్కర్‌ తనయుడు ఉదయ్‌ జక్కర్‌ ఆరోపించారు. మూడు నెలల కిత్రం తన తండ్రి ఆప్‌లో చేరారని, టికెట్‌ ఇచ్చే సమయంలో కేజ్రీవాల్‌ ఆరుకోట్లు డిమాండ్‌ చేశారని తెలిపారు. డబ్బు మొత్తం చెల్లించిన తరువాతనే తన తండ్రికి టికెట్‌ కేటాయించారని అన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయని ఉదమ్‌ వెల్లడించారు. కాగా ఆయన వ్యాఖ్యలు ఆప్‌ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పోలింగ్‌కు ఒక్కరోజు ముందు ఆప్‌ అభ్యర్థి తనయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

ఉదయ్‌ వ్యాఖ్యలు అవాస్తవం..
ఇదిలావుడంగా తన కుమారుడు చేసిన వ్యాఖ్యలు అవాస్తమని, కేజ్రీవాల్‌ తన వద్దనుంచి డబ్బు డిమాండ్‌ చేయలేదని స్పష్టంచేశారు. తన కుమారుడు తనతో చాలా తక్కువగా మాట్లాడుతాడని, ఆయన చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. తన భార్యకు 2008లో విడాకులు ఇచ్చానని కూడా బల్బీర్‌ ప్రకటించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top