‘బతుకమ్మ పండుగపై కూడా ఈసీని ఆశ్రయిస్తారేమో..!’

Karne Prabhakar Slams Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ఇంటెలిజెన్స్‌ అధికారులు టీఆర్‌ఎస్‌ నేతల ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు కర్నె ప్రభాకర్‌ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో టీడీపీ ఓటమి ఖాయమని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు భయం పట్టుకుందని విమర్శించారు. చంద్రబాబు ఏపీని వదిలి తెలంగాణకు వచ్చి రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలలు కూడా చంద్రబాబే దిక్కని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీకి అడ్డుపడింది కాంగ్రెస్‌ పార్టీనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నేతలు బతుకమ్మ పండుగపై కూడా ఈసీని ఆశ్రయించినా ఆశ్చర్యపడనక్కర్లేదని వ్యంగ్యంగా స్పందించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top