అసెంబ్లీ ప్రారంభం.. కామినేని వివరణ | Kamineni Srinivas Clarity on His Resign | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ ప్రారంభం.. కామినేని వివరణ

Mar 8 2018 10:52 AM | Updated on Mar 23 2019 9:10 PM

Kamineni Srinivas Clarity on His Resign - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌ ప్రవేశపెట్టేరోజే బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేయడంతో సమావేశాలు ప్రారంభంకాగానే వారు తమ రాజీనామ లేఖలపై మాట్లాడారు. బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, మంత్రి మాణిక్యాలరావు తమ రాజీనామా లేఖలను చంద్రబాబుకు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కామినేని మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని దోషిగా చూపే ప్రయత్నం జరుగుతోందని, ఈ నేపథ్యంలోనే తాను రాజీనామా చేస్తున్నానని అన్నారు. తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు బీజేపీనే కారణం అన్నారు. తాను బాధ్యతలు నిర్వర్తించినంత కాలం ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఎవరి వద్ద ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. తన శాఖ విజయవంతంగా కొనసాగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement