
బెంగళూరు: సంకీర్ణ సర్కార్ పతనానికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కారణమని బహిరంగంగా ధ్వజమెత్తిన జేడీఎస్ అధినేత హెచ్.డీ.దేవేగౌడ 17 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికలు సమీపిస్తుండగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు సిద్ధం కావాలని సంకేతం ఇచ్చారు. ఉప ఎన్నికల తేదీ నిర్ధారించలేదు. అంతలోగా కాంగ్రెస్, జేడీఎస్ మైత్రిపై కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ఆమోదానికి రావాలని విన్నవించారు. 17 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉండగా, ఈ మూడు నియోజకవర్గాలు జేడీఎస్ నుంచి తప్పిపోయే ఆందోళన దేవేగౌడను పీడిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోవాలనే ప్రతిపాదన ముందుంచటం రాజకీయ రంగంలో కుతూహలానికి కారణమైంది. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రానున్న ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ శక్తి ఏమిటనేది చూపిస్తానని, పార్టీ గురించి నోటికి వచ్చినట్లు ఎవరుపడితేవారు మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఈ విషయాలన్నీ తెలిసినా కూడా మౌనంగా ఉన్నానని, ఇకపై సహించుకోవటానికి సాధ్యం లేదని, ఇకపై ఇటువంటి మాటలకు అవకాశం ఇవ్వమని తేల్చి చెప్పారు.
తాను మాజీ ప్రధాని
బెంగళూరులో మాజీ మంత్రి డీ.కే.శివకుమార్ అరెస్టును ఖండిస్తూ జరిగిన ధర్నాలో పాల్గొనాలని తనకు ఆహ్వానం వచ్చిందని, అయితే తాను మాజీ ప్రధాని కావటంతో సభలో పాల్గొనలేదని దేవేగౌడ తెలియజేశారు. అయితే పార్టీకి చెందిన ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారన్నారు.