బీజేపీలోకి జయపద్ర.. ఆజంఖాన్‌పై పోటీ?

Jaya Prada May Join BJP - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ సినీ నటి జయప్రద బీజేపీలో చేరే అవకాశముందని తెలుస్తోంది. ఆమె సోమవారం బీజేపీలో చేరుతారని, యూపీలోని రాంపూర్‌ నియోజకవర్గం నుంచి ఆమెను కమలం పార్టీ బరిలోకి దింపే అవకాశముందని జాతీయ మీడియా పేర్కొంది. 

గతంలో సమాజ్‌వాదీ పార్టీలో కొనసాగిన జయప్రద.. రాంపూర్‌ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి ఎస్పీ నుంచి ఆ పార్టీ సీనియర్‌ నేత ఆజంఖాన్‌ రాంపూర్‌ నుంచి బరిలోకి దిగుతున్నారు. గతంలో ఒకే పార్టీలో కొనసాగిన జయప్రద-ఆజం ఖాన్‌ మధ్య బద్ధ వైరం నెలకొని ఉంది. తనపై యాసిడ్‌ దాడి చేసేందుకు ఆజంఖాన్ ప్రయత్నించాడంటూ.. ఆయనపై జయప్రద గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 

టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జయప్రద.. అనంతరం చంద్రబాబునాయుడితో విభేదించి.. ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. అప్పటికే బాలీవుడ్‌ నటిగా మంచి పేరు ఉండటంతో 2004లో ఆమెకు రాంపూర్‌ టికెట్‌ను ఎస్పీ కేటాయించింది. దీంతో మొదటిసారి ఎంపీగా గెలుపొందిన ఆమె.. అనంతరం ఎస్పీ అధినాయకత్వంతో విభేదించి తన సన్నిహితుడైన అమర్‌సింగ్‌తో కలిసి పార్టీని వీడారు. రాజకీయాల్లో అమర్‌సింగ్‌ను తన గాడ్‌ఫాదర్‌గా జయప్రద చెప్పుకుంటారు. వీరి సన్నిహిత్యంపై పలు విమర్శలు వచ్చినా.. ఆమె పెద్దగా పట్టించుకోరు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top