పార్టీలోకి ఆయన వస్తే... టీఆర్‌ఎస్‌ నుంచి వెళ్లిపోతా...!

If They Comes In. I Will Be Go. - Sakshi

కార్యకర్తల సమావేశంలో తాటి వెంకటేశ్వర్లు 

అశ్వారావుపేట: ‘‘టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆయన వస్తే... నేను వెళ్లిపోతా’’ అని, ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లిన నారాయణపురం సొసైటీ చైర్మన్‌ నల్లపు లీలాప్రసాద్‌ వెళ్లారు. ఆయన తిరిగి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నట్టు ఆదివారం సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. ఇది, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ  టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌ తాటి వెం కటేశ్వర్లు దృష్టికి వెళ్లింది.

దమ్మపేట మండలం గట్టుగూడెంలో ఆదివారం జరిగిన టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘‘అతను (లీలాప్రసాద్‌) వస్తే నేను బయటకైనా వెళ్లిపోతా’’ అని, లాలా ప్రసాద్‌ పేరు ప్రస్తావించకుండా మాట్లాడారు. ఇది, నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో తాటి ఏమన్నారో, వ్యక్తం చేసిన ఆవేదన ఎలాంటిదో ఆయన మాటల్లోనే చదువుదాం... 

‘‘నేనొకటి మనవి చేస్తున్నా...! ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరేమనుకున్నా ఫర్వాలేదు. టీఆర్‌ఎస్‌ పార్టీలో ఈ నాలుగు సంవత్సరాలున్న వ్యక్తులు ఒకరిద్దరు... మొన్నటి ఎన్నికల్లో పార్టీ గెలుపునకు పనిచేయలేదు. నేను వాళ్లతో మంచిగానే ఉం టున్నా. నాతో పని చేయించుకున్నారు. నన్ను చివరి వరకు నమ్మించారు. చివరి నిమిషంలో, నా ప్రత్యర్థికి మద్దతు తెలి పా రు. నా ముందు నిలుచుని, నా ప్రత్యర్థి తరఫున ప్రచారం చేశా రు. ఎన్నికల్లో ఏజెంటుగా ఉన్నారు. ఇంత నష్టం చేసి, మళ్లీ మన పార్టీలోకి వస్తారట. ఏదో ఆశించి, మళ్లీ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిని నేను వ్యతిరేకిస్తున్నాను.

వారు ఇక్క డికి (టీఆర్‌ఎస్‌లోకి) ఒకరొస్తే... ఇక్కడి నుంచి (టీఆర్‌ఎస్‌ నుంచి) పదిమంది బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారికి అవకాశమిస్తే నష్టం జరగడంతోపా టు, మా మీద అపనింద పడుతుంది. దయచేసి ఆ అపనిందకు తావివ్వకుండి. నేను హృదయపూర్వకంగా పనిచేస్తున్నాను. మీ రెక్కడికి పిలిస్తే అక్కడికొచ్చాను. నేను నాలుగున్నరేళ్లుగా ఎమ్మెల్యే గా ఉండి పిచ్చోడిలా తిరిగాను. చావు, దినం, పెళ్లి, అధికార కార్యక్రమాలు... అనేక రకాలుగా తిరిగాను. ఇంటవద్ద ఒక పూ ట భోజనం చేసేందుకు సమయం లేకుండా వర్కర్‌లాగా తిరి గాను. మీతో (కార్యకర్తలతో) ఏనాడూ నాయకుడిగా లేను.

నామా నాగేశ్వరరావు నుంచి ఏదో లబ్ధి దొరుకుతుందని, దో చుకుందామని ఆశపడుతున్నారు. అం దుకే మన పార్టీలోకి మళ్లీ వద్దామనుకుంటున్నారు. వారికి ఆ అవకాశం ఇవ్వవద్దని మనవి చేస్తున్నా. మన పార్టీలో చేరిన వెంటనే, గులాబీ కండువా తీసేసి ఇంకో కండువా కప్పుకుంటారు. అలాంటి చేరికలు ఇప్పుడేమీ అవసరం లేదు. మీ ఇష్టం... చేర్చుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. ఫలానా వ్యక్తిని తీసుకొస్తున్నా నని ఓ నాయకుడు చెబితే... నాకు అవసరం లేదని చెప్పాను. ఓ రౌడీషీటర్‌ ఉన్నాడు. 2014లో వైఎస్సార్‌ సీపీ నుంచి నేను ఎ మ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నా తరఫున ఆయన పని చేయలేదు. కొన్ని నెలల తర్వాత నా వద్దకు వచ్చాడు.

పార్టీలో చేరాడు. వచ్చిన రెండు నెలలకే 90 శాతం సబ్సిడీపై అతడికి ట్రాక్టర్‌ ఇప్పించాను. అడవిలో ఉన్న ఎనిమిది ఎకరాల వ్యవసా య భూమి పోతుందంటే... ఎంతో పోరాడి కాపాడాను. భూ మి, ట్రాక్టర్, కరెంటు... అన్నీ ఇప్పించాను. ఆయనపై రౌడీషీట్‌ ఎత్తేయాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చాను. ఇన్ని పనులు చే యించుకున్న అతడి ఇంటికి (ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలప్పుడు) నేను రెండుసార్లు వెళ్లాను, ఫోన్లు చేశాను. ‘అమ్మా నేను తాటి వెంకటేశ్వర్లును వచ్చానమ్మా’ అని, వాళ్ల ఇంట్లో వాళ్లకు చెప్పాను. ఒకసారి ఫోన్లో మాట్లాడాను.

‘నేను మాల వేసుకున్నాను. పార్టీ మారను. నీకే పనిచేస్తా’ అని మాటిచ్చాడు. ఆ తరువాత మాట తప్పాడు. అతడు పుట్టగతులు కూడా లేకుండా పోతాడు. అతనొస్తే నేను మాత్రం సహించను. నన్ను తప్పుకోమన్నా తప్పుకుంటాను. నామా నాగేశ్వరావును గెలిపించుకోవడానికి ఇప్పడున్న వారు చాలు. ‘అలాంటి’ వారు అవసరం లేదు. నా తప్పులేవయినా ఉంటే ఎత్తి చూపండి... వాటికి సమాధానం చెప్పుకుంటా...’’.
తాటి వెంకటేశ్వర్లు ఉపన్యాసం ఇలా సాగింది. తాటి వద్దన్న ఆ వ్యక్తులు ఆదివారం వరకు టీఆర్‌ఎస్‌లో చేరలేదు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top