
కరీంనగర్ : తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయకుండా ఏపీకి మాత్రమే ఇస్తూ పార్లమెంటులో బిల్లు పెడితే అడ్డుకుంటామని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్ హెచ్చరించారు. కరీంనగర్‌లో ఎంపీ వినోద్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చడం లేదని విమర్శించారు. విభజన చట్టంలోని హామీలపై శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై కోర్టు వివరణ ఇవ్వాలని కోరారు. ఎవ్వరైనా చట్టాన్ని గౌరవించక తప్పదని చెప్పారు.