అంతర్‌రాష్ట్ర వారధి నిర్మించా..ఆదరించాలి | I Introducing Interstate Bridge: Uthamkumar reddy | Sakshi
Sakshi News home page

అంతర్‌రాష్ట్ర వారధి నిర్మించా..ఆదరించాలి

Published Tue, Apr 9 2019 3:02 PM | Last Updated on Tue, Apr 9 2019 3:02 PM

I Introducing Interstate Bridge: Uthamkumar reddy - Sakshi

మఠంపల్లి : రోడ్‌షోలో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

మఠంపల్లి : తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దుగా ఉన్న మట్టపల్లి వద్ద క్రిష్ణానదిపై కాంగ్రెస్‌ ప్రభుత్వ హాయాంలో రూ.50కోట్లు మంజూరు చేసి అంతరాష్ట్ర వారథి హైలెవల్‌ వంతెన నిర్మాణానికి కృషి చేసినందున ఆదరించి కాంగ్రెస్‌పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ అభ్యర్థి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. సోమవారం ఆయన పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మట్టపల్లి, పెదవీడు, మఠంపల్లి, రఘునాథపాలెం, తదదితర గ్రామాలలో రోడ్‌షో నిర్వహించారు.

ముందుగా ఆయన హైలెవల్‌ వంతెనను పరిశీలించారు. అనంతరం జరిగిన సభలలో మాట్లాడారు. కిష్టపట్టె ప్రాంతం వ్యవసాయాభివృద్ధితో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు రైల్వేలైను, హైలెవల్‌ వంతెన, సబ్‌స్టేషన్‌లు నిర్మించానన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈప్రాంత అభివృద్దికి తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. కాగా అన్ని గ్రామాలలో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు బైక్‌ ర్యాలీలతో ఉత్తమ్‌కు ఘన స్వాగతం పలికారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement