నవంబర్‌ 3లోపు మీ వైఖరి తెలపాలి

Hardik Patel's ultimatum to Congress: Take a stand on Patidar quota resverations - Sakshi

పటేళ్లకు రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు హార్దిక్‌ అల్టిమేటం

అహ్మదాబాద్‌: పటేళ్ల రిజర్వేషన్లపై నవంబర్‌ 3లోగా తమ వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్‌ పార్టీకి పటేళ్ల ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ గడువిచ్చారు. డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తేనే గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతుపై ఆలోచిస్తామన్నారు. లేదంటే నవంబర్‌ 3న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ చేపట్టే సూరత్‌ పర్యటనను అడ్డుకుంటామన్నారు. కాగా, ఎన్నికల్లో పటీదార్‌ వర్గీయులకు అధికంగా టికెట్లు ఇవ్వడం, పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించడం వంటి డిమాండ్ల జాబితాను గుజరాత్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జీ అశోక్‌ గెహ్లాట్‌కు హార్దిక్‌ పటేల్‌ ఇటీవల అందజేశారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో డిసెంబర్‌ 9, 14న జరుగనున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top