‘బీజేపీని కార్నర్‌ చేస్తున్న టీడీపీ’ | GVL Narasimha Rao Criticises TDP Leaders | Sakshi
Sakshi News home page

‘బీజేపీని కార్నర్‌ చేస్తున్న టీడీపీ’

Mar 8 2018 7:59 PM | Updated on Mar 23 2019 9:10 PM

GVL Narasimha Rao Criticises TDP Leaders - Sakshi

జీవీఎల్‌ నరసింహారావు

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యంకాదని, అందుకే సాయం చేస్తామని కేంద్రం చెప్పినట్టు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని మాట ఇచ్చారు కాబట్టే ఆ మాటపై నిలబడ్డామన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నప్పుడు తలూపిన చంద్రబాబు ఇప్పుడెందుకు కొత్తపాట పాడుతున్నారని ప్రశ్నించారు.

ఎన్నికల హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఇంకా పదేళ్ల సమయం ఉందని, ప్రజలు వాస్తవాలు తెలుకోవాలని కోరారు. తాము మిత్రధర్మాన్ని విస్మరించలేదని, టీడీపీ నాయకులే రాజకీయ లబ్ధి కోసం తమను కార్నర్‌ చేస్తున్నారని వాపోయారు.

కాగా, ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఇద్దరు టీడీపీ ఎంపీలు కేబినెట్‌ పదవులకు రాజీనామా సమర్పించారు. అయితే తమ ఎంపీలు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా కొనసాగుతారని టీడీపీ ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement