'టీఆర్‌ఎస్‌తో పొత్తు అంటూ.. టీడీపీ విషప్రచారం' | Guttha Sukender reddy fires on TDP | Sakshi
Sakshi News home page

'టీఆర్‌ఎస్‌తో పొత్తు అంటూ.. టీడీపీ విషప్రచారం'

Jan 17 2019 10:31 AM | Updated on Jan 17 2019 4:46 PM

Guttha Sukender reddy fires on TDP - Sakshi

టీఆర్‌ఎస్‌-వైఎస్సార్‌సీపీ పొత్తు అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారు.

సాక్షి, నల్గొండ : జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగానే టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బుధవారం హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారని ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. వైఎస్‌ జగన్‌ను కేటీఆర్‌ కలవడంతో టీడీపీ నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌-వైఎస్సార్‌సీపీ పొత్తు అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారని నిప్పులుచెరిగారు. 

వైఎస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూడలేక టీఆర్‌ఎస్‌తో పొత్తు అంటూ టీడీపీ విషప్రచారం చేస్తుందని గుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో 4సంవత్సరాలు సంసారం చేసి ఇప్పుడు టీడీపీ నేతలు శ్రీరంగ నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీడీపీని కాంగ్రెస్‌ని ఏవిధంగా తిరస్కరించారో, ఆంధ్రాలో కూడా టీడీపీని కాంగ్రెస్‌ని ప్రజలు తిరస్కరించడం ఖాయమని గుత్తా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement