
లోక్‌సభ మాజీ స్పీకర్‌ను సత్కరిస్తున్న నాయకులు
భువనగిరి : లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ టీఎస్‌పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆది వారం భువనగిరిలో డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. వరంగల్‌లో జరిగిన సింహగర్జనకు హాజరయ్యే ందుకు వెళ్తూ మార్గమధ్యలో బైపాస్ రోడ్డులోని వివేరా హోటల్‌లో అరగంట పాటు ఆగి భోజ నాలు చేశారు.
హోటల్ వద్దకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు అభివాదం చేస్తూ వరంగల్‌కు వెళ్లిపోయారు. వీరివెంట లోక్‌సభ కాంగ్రెస్ ప్రతిపక్షనేత మల్లికార్జున్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, గూడూరు నారాయణరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ మంత్రి బలరాంనాయక్, నాయకులు కొప్పుల రాజు, తడక కల్పన, తంగళ్లపల్లి రవికుమార్, బర్రె జహంగీర్, పొత్నక్ ప్రమోద్‌కుమార్, బీసుకుంట్ల సత్యనారా యణ, చల్లగురుగుల రఘుబాబు ఉన్నారు.