‘5 శాతం కుదరనపుడు.. 12 శాతం ఎలా ఇస్తావ్‌’ | Ghulam Nabi Azad Critics On KCR Over Muslim Reservations | Sakshi
Sakshi News home page

Sep 20 2018 4:00 PM | Updated on Mar 18 2019 9:02 PM

Ghulam Nabi Azad Critics On KCR Over Muslim Reservations - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న గులాంనబీ ఆజాద్‌

వైఎస్సార్‌ ప్రతిపాదించిన 5 శాతం రిజర్వేషన్లనే కోర్టు అనుమతించనపుడు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ముస్లింలకు కేసీఆర్‌ ఎలా హామీనిచ్చారని ప్రశ్నించారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కేటాయించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిదేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్య సభలో విపక్షనేత గులాంనబీ ఆజాద్‌ అన్నారు. తొలుత ముస్లిం సోదరులకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని వైఎస్సార్‌ ప్రతిపాదించారని గుర్తు చేశారు. అయితే, సుప్రీం కోర్టు ఒప్పుకోకపోవడంతో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆజాద్‌ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మీడియాతో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ ముస్లింలను మోసం చేశారని ఆరోపించారు. వైఎస్సార్‌ ప్రతిపాదించిన 5 శాతం రిజర్వేషన్లనే కోర్టు అనుమతించనపుడు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ముస్లింలకు కేసీఆర్‌ ఎలా హామీనిచ్చారని ప్రశ్నించారు. వైఎస్సార్‌ కృషితో ముస్లింలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement