అభ్యర్థుల ఎంపికపై తుది దశ కసరత్తు  | Final stage work on selection of candidates in Congress Party | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల ఎంపికపై తుది దశ కసరత్తు 

Oct 27 2018 1:29 AM | Updated on Sep 19 2019 8:44 PM

Final stage work on selection of candidates in Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపికకు ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీ తుదిదశ కసరత్తును శుక్ర వారం మొదలు పెట్టింది. ఇప్పటికే కాంగ్రెస్‌ ఆశావహుల నుంచి వినతుల స్వీకరణ, అభ్యర్థుల ఎంపికకు శ్రీకారం చుట్టిన కమిటీ చివరి అంకంలో భాగంగా మరోసారి నియోజకవర్గాలవారీగా అధ్యయనం, సూక్ష్మస్థాయి పరిశీలన చేసే పనిలో పడింది. శుక్రవారం ఉదయమే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వచ్చిన కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌.. పలువురు ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. సాయంత్రం గాంధీభవన్‌లో ఆశావహులు, ముఖ్యనేతలు, జిల్లా అధ్య క్షులు, వివిధ సంఘాలతో సమావేశమ య్యారు. వారి నుంచి వినతులు స్వీకరించారు.

ఈ సందర్భంగా ముషీరాబాద్‌ టికెట్‌ కేటాయించాలని పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, కార్యదర్శి ఎస్తేర్‌ రాణిలు విన్నవించగా, చేవెళ్ల టికెట్‌ కేటాయించాలని ఓయూ విద్యార్థినేత కురువ విజయ్‌కుమార్‌ విన్నవించుకున్నారు. అనంతరం భక్తచరణ్‌దాస్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుం తియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహతో గోల్కొండ హోటల్‌లో భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల బలాలు, బలహీనతలపై వివరాలు అడిగి తెలు సుకున్నారు. రెండేసి పేర్లున్న 50కి పైగా స్థానా ల్లో ఎవరిని ఫైనల్‌ చేయాలన్న అంశాలపై ఆరా తీశారు. ఈ నియోజకవర్గాల్లో నేతలు సూచించిన అభ్యర్థుల పేర్లపై భిన్న కోణాల్లో సమాచారం సేకరించారు. కూటమి పొత్తులు, వారు కోరుతున్న స్థానాలపైనా ఆరా తీసినట్లుగా తెలిసింది. ఏ ప్రాతిపదికన కూటమి పార్టీలకు నియోజకవర్గాలను కేటాయిస్తున్నారు.. ఆ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement