
రాజమహేంద్రవరం రూరల్: ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి రాష్ట్రంలో కనపడనీయకుండా కొన్ని దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. తనను ఇబ్బంది పెట్టేందుకు కొంత మంది శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. అలాంటి వాటికి తాను భయపడబోనన్నారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో సోమవారం సోము వీర్రాజు విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో శ్మశాన వాటికలు, అంగన్‌వాడీ భవనాలు, చంద్రన్న బాట పేరుతో వేసే సీసీ రోడ్లు, స్వచ్ఛభారత్ తదితర పథకాలకు ఖర్చు పెట్టే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవేనని సోము వీర్రాజు పేర్కొన్నారు.