'నా వీడియో సీడీలా.. ఎంజాయ్‌ చేసుకోనివ్వండి..'

Enjoy my latest video clips : Hardik Patel - Sakshi

సాక్షి, అహ్మదాబాద్ ‌: తాను మహిళలతో అసభ్యకరస్థితిలో ఉన్నట్లు వచ్చిన రెండు వీడియోల విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పటేల్‌ ఉద్యమ నాయకుడు హార్థిక్‌ పటేల్‌ తాజాగా ప్రత్యక్షమైన వీడియోల విషయంలో చాలా కూల్‌గా స్పందించారు. ఆ వీడియోలను చూసేవారిని ఎంజాయ్‌ చేయనివ్వండి అంటూ బదులిచ్చారు.

అలాంటి క్లిప్స్‌తో తనకు ఎలాంటి సమస్యలేదని, అలాంటప్పుడు చూసేవారిని ఎందుకు వద్దనాలని, వారిని ఎంజాయ్‌ చేసుకోనివ్వండి అని చెప్పారు. ఒక మహిళ, మరో ముగ్గురు యువకులతో అసభ్యకరంగా ఉన్నట్లు ఉన్న మొత్తం ఐదు వీడియోలు తాజాగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం గుజరాత్‌ ఎన్నికల ప్రచారం ఉన్న ఆయనను ఈ విషయంపై స్పందన కోరగా పై విధంగా స్పందించారు. బీజేపీ ఇలాంటి చెత్త రాజకీయాలు చాలా చేస్తుందని, మున్ముందు మరిన్ని వీడియోలు తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని, మార్ఫింగ్‌ వీడియోలు పెట్టడం బీజేపీకి అలవాటేనని ఆయన విమర్శించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top