ఐదు కాదు ఏడు చోట్ల రీపోలింగ్‌ | Election Commission Orders Repoll In Another Two Polling Stations In Chandragiri Constituency | Sakshi
Sakshi News home page

చంద్రగిరి పరిధిలో మరో రెండు చోట్ల రీపోలింగ్‌

May 18 2019 1:43 PM | Updated on May 18 2019 6:01 PM

Election Commission Orders Repoll In Another Two Polling Stations In Chandragiri Constituency - Sakshi

సాక్షి, తిరుపతి : చిత్తురు జిల్లా చంద్రగిరిలో నియోజకవర్గ పరిధిలో మరో రెండు చోట్ల రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని జిల్లా ఎన్నికల సంఘం అధికారి ప్రద్యుమ్న తెలిపారు. దీంతో ఇప్పటికే ప్రకటించిన 5 పోలింగ్‌ కేంద్రాలతో(ఎన్‌ఆర్‌ కమ్మపల్లి, పులివర్తివారిపల్లి, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, వెంకట్రామపురం) పాటు కొత్తగా ప్రకటించిన కాలురు, కుప్పం బాదురుల కేంద్రాలలో ఆదివారం రీపోలింగ్‌ జరగనుంది.

పోలింగ్‌ నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేస్తున్నామని కలెక్టర్‌ ప్రద్యుమ్న చెప్పారు. చంద్రగిరి పరిధిలో మొత్తం ఏడు చోట్ల నిర్వహించే రీపోలింగ్‌కు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ వద్ద 250 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశామని చెప్పారు. రీపోలింగ్‌కు  కేంద్రాలలో ఏ చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీపోలింగ్‌ ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
చంద్రగిరి పరిధిలో మొత్తం ఏడు చోట్ల రీపోలింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement