సినిమా భాషలో చెబితేనే చెవికెక్కుతుంది..

Ec educates through mimicry and songs - Sakshi

సాక్షి, మధ్యప్రదేశ్‌: ప్రజలకు ఓటుపై అవగాహన కల్పించడం.. ఎన్నికల అధికారుల బాధ్యత. ఇందుకోసం ఒక్కొక్క అధికారి ఒక్కో స్టైల్లో ప్రయత్నిస్తుంటారు. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లా ఎన్నికల అధికారి విశేష్‌ గర్ఫాలే కూడా ఇలాగే వినూత్నమైన పద్ధతిలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మిమిక్రీ కళాకారుల ద్వారా బాలీవుడ్‌ స్టార్లు షారుక్, సల్మాన్, అమీర్, అనుష్క శర్మల డైలాగ్‌లతో ప్రజలకు ఓటుపై అవగాహన కల్పిస్తున్నారు. ‘అధికారులు నిరక్షరాస్యులకు ఒటుపై అవగాహన కల్పిస్తున్నా.. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఓటు ప్రాముఖ్యత తెలియడం లేదు. ఇందుకోసంబాలీవుడ్‌ సినిమాల ఫేమస్‌ డైలాగ్‌లను ఉపయోగించాలని అనుకున్నారు.  

అలాంటి ఫేమస్‌ డైలాగుల్లో.. ‘మైనే ఏక్‌ బార్‌ కమిట్‌మెంట్‌ కర్‌ ది తో మై వోట్‌ జరూర్‌ కర్తాహూ’ (నేను ఒక్క సారి ఓటు వేయాలని కమిటైతే ఓటు వేసి తీరతా), ‘మేరే పాస్‌ బంగ్లాహై, గాడీహై తుమ్హారేపాస్‌ క్యా హై’  మేరే పాస్‌ ఓటర్‌ కార్డ్‌ హై!’వంటి డైలాగులతో.. మిమిక్రీ కళాకారులు వీధి ప్రదర్శనలు చేస్తున్నారు’ అని కలెక్టర్‌ పేర్కొన్నారు. వీటికి ప్రజలనుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఈ తరహా ప్రచారానికి మరిన్ని వినూత్న ఆలోచనలు ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్‌ ఓ పోటీ నిర్వహించారు. దీంట్లో పాల్గొన్న వారిలో కొందరు జంగిల్‌బుక్‌లోని కార్టూన్‌ క్యారెక్టర్స్‌తో అలరించారు. ఈ ప్రదర్శనలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం, జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోస్టర్లను అతికించడం ద్వారా మరింత మంది ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశముంటుందని గర్పాలే అభిప్రాయపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top