దళితులకు రక్షణ లేదు | Dalits are not protected says Harish rao | Sakshi
Sakshi News home page

దళితులకు రక్షణ లేదు

Apr 4 2018 2:55 AM | Updated on Mar 18 2019 9:02 PM

Dalits are not protected says Harish rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో దళితుల కోసం చట్టాలున్నా రక్షణ లేకుండా పోయిందని, వాటిని సమీక్షిస్తే పరిస్థితి దుర్భరం అవుతుందని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు రాములు నాయక్, ఎం.శ్రీనివాస్‌రెడ్డితో కలిసి తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఏటా 40 వేలకుపైగా ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదవుతున్నాయన్నారు.

దళితుల రక్షణ కోసం ఉన్న చట్టాలను సమీక్షిస్తే దాడులు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరుగుతుంటే కేసులు పెరుగుతున్నాయని, దళితుల్లో ఉన్న బాధను లోతుగా అర్థం చేసుకోవాలన్నారు. ప్రధాని మోదీ చొరవ తీసుకుని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీలపై బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.దేశంలో గుణాత్మక మార్పులు వస్తేనే అట్టడుగు వర్గాల కష్టాలు తీరుతాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. దళితుల్లోని ఆందోళనను, ఆవేదనను పట్టించుకోకుండా కాల్పులు చేశారని విమర్శించారు. ఈ సందర్భంగా 9 మంది మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికరమన్నారు. 

వాస్తవాలు తెలుసుకోవాలి
భారత్‌ బంద్‌కు పిలుపు ఇచ్చే పరిస్థితి ఎందుకు ఏర్పడిందో ఆలోచించాలని హరీశ్‌రావు కోరారు. దళితుల రక్షణకోసం బ్రిటిష్‌ హయాం నుంచే ప్రత్యేక చట్టాలున్నాయని, వాటిని కాపాడటం కూడా కాంగ్రెస్, బీజేపీలకు చేతకావడంలేదన్నారు. దేశంలో గుణాత్మక జాతీయ రాజకీయాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతున్నారంటే దళిత, గిరిజనులపై దాడులు కూడా ప్రధాన కారణమని హరీశ్‌రావు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకుని న్యాయస్థానాలు వ్యవహరించాలన్నారు. పోలీసులతోనే, బలప్రయోగంతోనే దళితులను అణచి వేయాలని చూస్తే ఫలితం ఉండదన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement