
సాక్షి, తూర్పుగోదావరి : వ్యవస్థలను మేనేజ్ చేసిన చంద్రబాబు.. ప్రభుత్వాని ఇబ్బంది పెట్టి, ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నాడని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. బాబు తన పతనానికి తానే గొయ్యి తవ్వుకుంటున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోమవారం కాకినాడలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి విషయాన్నివ్యవస్థలో తన మనుషుల ద్వారా అడ్డుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయిందని విమర్శించారు. బాబుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేలా వ్యవస్థలో తన మనుషులను ముందుగానే సిద్ధం చేసుకున్నారని తెలిపారు. ఈ రోజు ఇరవై అయిదు లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు అందకుండా చంద్రబాబు అడ్డుకోవడం బాధాకరమన్నారు. చంద్రబాబు తన మనుషులను ఉపయోగించుకుంటూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నాడని దుయ్యబట్టారు.(‘వైఎస్సార్ విగ్రహం ధ్వంసం; శ్రీరామ్ అంగీకరించారు’)
చంద్రబాబుకు దమ్ముంటే ఖాళీగా ఉన్న తన కొడుకు లోకేష్‌ను రాష్ట్రంలో ఎక్కడనుంచి అయినా సర్పంచ్‌గా పోటీ చేయించాలని ఛాలెంజ్ చేశారు. ప్రజల తీర్పు ఏలా ఉంటుందో మరోసారి బాబుకు క్లియర్‌గా అర్థం అవుతుందని అన్నారు. టీడీపీ ఇప్పటికే 100 అడుగుల లోతులో సమాధి అయిపోయిందని, దాన్ని తవ్వి తీయడం సాధ్యమయ్యే పని కాదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు కరోనా వైరస్ కాదని, ఎన్నికల కమీషనర్‌కు నారా వారి వైరస్ పట్టిందని విమర్శించారు. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నని చెప్పి.. గుంటూరు,చిత్తూరు కలెక్టర్‌లను మారుస్తున్నాని ఎన్నికల కమీషనర్ రాజకీయ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. (ఎన్నికలు వాయిదా: సుప్రీంను ఆశ్రయించిన సర్కార్ )
రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల ఒక్క మరణమైన సంభవించిందా.. అని ఎన్నికల కమిషనర్‌ను ప్రశ్నించారు. ఎన్నికల వాయిదాకు కరోనా అనేది ఒక సాకు మాత్రమేనని, ఎన్నికల కమీషనర్ చంద్రబాబు రుణం తీర్చుకుంటున్నాడని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారన్నారు. ఎన్నికల వాయిదా వల్ల కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన రూ.5 వేల కోట్లు ఎలా సర్ధుబాబు చేస్తారని ఎన్నికల కమీషనర్‌ను ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విచక్షణ కోల్పోయి తీసుకుంటున్నారని మండిపడ్డారు. (సామాజిక వర్గాలను అడ్డు పెట్టుకొని పెత్తనం ఏంటి?)