ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: దాడిశెట్టి | Dadisetti Raja Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: దాడిశెట్టి

Jun 10 2019 2:28 PM | Updated on Jun 10 2019 2:30 PM

Dadisetti Raja Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, కాకినాడ : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనంతో ప్రతిపక్ష పార్టీలు అడ‍్రసు లేకుండా గల్లంతు అయ్యాయని ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా అన్నారు. ఆయన సోమవారమిక‍్కడ మాట్లాడుతూ..‘ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పరిపాలనను మరిపించేలా పాలన ఉంది. టీడీపీ నేతలు, కార్యకర్తలే జగన్‌ చాలా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారని చెబుతున్నారు. చంద్రబాబులా జగన్‌కు ప్రజలను మోసం చేయడం తెలియదు....రాదు. చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకోవడం కోసమే తన సమయాన్ని వినియోగించుకున్నారు. అదే జగన్ మంచి పాలనపై దృష్టి పెట్టి ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీఏసీ సభ్యుడుగా వైఎస్‌ జగన్ బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ విప్‌గా మరో బాధ్యత ఇచ్చారు. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతను నిలబెట్టుకుంటాను.’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement