ఆయన తెలుగు రాష్ట్రాల పాలిట శాపం | curse to telugu people | Sakshi
Sakshi News home page

ఆయన తెలుగు రాష్ట్రాల పాలిట శాపం

Feb 7 2018 7:40 PM | Updated on Sep 17 2018 5:32 PM

curse to telugu people - Sakshi

తెలంగాణ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్‌

హైదరాబాద్‌ : భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల పాలిట శాపంగా మారాడని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్‌ విమర్శించారు. గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ..నేటితో తెలంగాణపై బీజేపీ నిజస్వరూపం బయట పడిందని వ్యాఖ్యానించారు. మోదీ తెలంగాణ పై విషం గక్కారని ఘాటుగా స్పందించారు. రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా ఇవ్వకుండా అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుపట్టే సాహసం చేశారని మండిపడ్డారు.

మోదీ తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసిన తరువాత కూడా ఆత్మగౌరవం ఉన్న నాయకులు ఎవరూ బీజేపీలో ఉండరని వ్యాఖ్యానించారు. మోదీ దెబ్బకు తెలంగాణలో బీజేపీకి ఉన్న దింపుడు కళ్లెం ఆశలు కూడా కరిగిపోయాయన్నారు. తెలంగాణ ద్రోహులు మాత్రమే బీజేపీలో మిగులుతారని వ్యాఖ్యానించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement