వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి రేవంత్‌ రాజీనామా

Congress MP Revanth Reddy resigns as Congress working president - Sakshi

సాక్షి, నల్గొండ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి మద్దతుగా తెలంగాణలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. రాహుల్‌ తన నిర్ణయాన్ని మార్చుకుని ఏఐసీసీ పగ్గాలు చేపట్టాలని కోరుతూ టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి పొన్నం ప్రభాకర్‌ ఇప్పటికే రాజీనామా చేయగా, మరో వర్కింగ్‌ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కూడా రాజీనామా చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలయినప్పుడు కీలక హోదాల్లో ఉన్న నేతలు బాధ్యత వహించాలన్న రాహుల్‌ గాంధీని స్ఫూర్తిగా తీసుకుని తాను టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్టు శనివారం ఆయన వెల్లడించారు. ప్రెస్‌మీట్‌లతో ప్రజలు కనెక్ట్‌ కావడం లేదని, ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాల్సిందేనని అన్నారు. ఎన్నికలప్పుడు బాధ్యతలలో ఉన్నవారు రాజీనామా చేయాలని రాహుల్‌ రాజీనామా చేశారని, అందుకే తాను కూడా రాజీనామా చేసినట్లు రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. 

మొత్తం మీద రాజకీయంగా ఎప్పుడూ వార్తలో ఉండే రేవంత్‌ ఈసారి కూడా తనదైన శైలిలో రాజీనామాను ప్రకటించి అటు పార్టీలోనూ, ఇటు అధిష్టానం దృష్టిలోనూ చర్చనీయాంశం కావడం గమనార్హం.  అలాగే మాజీ ఎంపీ వి హనుమంతరావు కూడా తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు. దీంతో రాహుల్‌కు మద్దతుగా ఇద్దరు వర్కింగ్‌ ప్రెసిడెంట్లకు తోడు మరో సీనియర్‌ నేత రాజీనామా చేసినట్టయింది. మరికొందరు నేతలు కూడా నేడో, రేపో రాజీనామాలు సమర్పించనున్నట్లు తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter | తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top