కాంగ్రెస్‌ వల్లే.. అవి జరిగాయా?

Congress divided India on religion - Sakshi

ఓట్లకోసం కులాల మధ్య చిచ్చు

స్వతంత్రం రాకముందు దేశ విభజన

తరువాత కులాల విభజన

కాంగ్రెస్‌పై వీకే సింగ్‌ సంచలన ఆరోపణలు

సాక్షి, డెహ్రాడూన్‌ : దేశాన్ని మత, కుల ప్రాతిపదికన మొదట విభజించింది కాంగ్రెస్‌ పార్టీనేని కేంద్రమంత్రి, మాజీ ఆర్మీ చీఫ్‌ వీకే సింగ్‌ తీవ్ర విమర్శలు చేశారు. డెహ్రాడూన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌ పార్టీపై మండిపడ్డారు. కాంగ్రెస్‌ వల్లే దేశం విడిపోయిందని.. కేవలం మత ప్రాతిపదికన బ్రిటీష్‌ పాలనలో పాకిస్తాన్‌ను ఏర్పాటుకు సహకరించిందని అన్నారు. అప్పట్లో మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల్లో విభజన తెచ్చిన కాంగ్రెస్‌ తరువాత కాలంలో.. ఓట్ల కోసం కులాలను చీల్చిందని తీవ్రమైన పదజాలంతో విమర్శించారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోసం నిరంతరం దేశాన్ని చీల్చేందుకు ప్రయత్నించిందని అన్నారు. ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాల్లోని ప్రజలకు గతం‍లో విద్య, ఉద్యోగ, ఉపాధి మార్గాలు లేవని.. ప్రస్తుత మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top