జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల నగారా

CEC Sunil Arora announce schedule for Jharkhand assembly elections - Sakshi

నవంబర్‌ 30 నుంచి ఐదు దశల్లో పోలింగ్‌

డిసెంబర్‌ 23న ఫలితాల వెల్లడి

ఎన్నికల ప్రధాన అధికారి అరోరా

సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 20వ తేదీ వరకు ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహిం చనున్నట్టు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్‌ అరోరా వెల్లడించారు. డిసెంబర్‌ 23న ఫలితాలను వెల్లడించనున్నట్టు తెలిపారు. 2020 జనవరి 5వ తేదీతో ప్రస్తుత రాష్ట్ర శాసనసభ గడువు ముగియనుంది. మావోయిస్టు ప్రభావిత జార్ఖండ్‌ రాష్ట్రంలో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌ 30వ తేదీన నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 7న రెండో దశ, డిసెంబర్‌ 12, 16, 20వ తేదీల్లో మిగిలిన మూడు దశల్లో పోలింగ్‌ జరుపుతారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో 2014లో మాదిరిగానే ఐదు దశలుగా ఎన్నికలు నిర్వహించనునట్టు సునీల్‌ అరోరా వెల్లడించారు. రఘుబర్‌ దాస్‌ సీఎంగా 2014, డిసెంబర్‌ 28న జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top