టీఆర్‌ఎస్‌కు అభ్యర్థి దొరకలేదా?

Can Not Find a Candidate For trs? - Sakshi

మునుగోడులో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా

రాహుల్‌ ప్రధాని అయితే  రైతులకు రుణమాఫీ: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  

మిర్యాలగూడ : నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేయడానికి టీఆర్‌ఎస్‌కు స్థానికులు దొరకలేదా? టికెట్‌ అమ్ముకున్నారా? అని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం మిర్యాలగూడలో రోడ్‌షో నిర్వహించారు. స్థానిక హనుమాన్‌పేట చౌరస్తా నుంచి రాజీవ్‌చౌక్‌ వరకు సాగింది. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మునుగోడులో చెల్లని రూపాయి, నల్లగొండలో చెల్లుతుందా? అని అన్నారు. నల్లగొండ ప్రజలు చైతన్యవంతులని, డబ్బు, మద్యంతో వచ్చే వారిని ఓడిస్తారని అన్నారు.

ఈ ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని, రాహుల్‌గాంధీకి, నరేంద్రమోదీకి మధ్య జరుగుతున్నాయని అన్నారు. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కాగానే ప్రతి పేద కుటుం బానికి నెలకు రూ.6 వేల రూపాయల చొప్పున అందిస్తారని, రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఒకే సారి చేస్తారని పేర్కొన్నారు. ఎంపీగా గెలిచి నల్లగొండ ప్రజలు గర్వపడేలా నడుచుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ కార్యదర్శి, మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్‌చార్జి అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, డీసీసీ అద్యక్షుడు శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని కోరారు. నల్లగొండ అభ్యర్థిగా పోటీ చేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దేశ రక్షణకు సైనికుడిగా పనిచేస్తే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భూ కబ్జాదారుడిగా ఆక్రమణ లకు పాల్పడ్డాడని ఆరోపించారు.

ఇందిరమ్మ రా జ్యం రావాలంటే రాహుల్‌గాంధీ ప్రధాని కావాల ని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి సాధినేని శ్రీనివాస్‌రావు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, మేడ సురేందర్‌రెడ్డి, ముజ్జ రామకృష్ణ, సలీం, ముదిరెడ్డి నర్సిరెడ్డి, నూకల వేణుగోపాల్‌రెడ్డి, శాగ జలేందర్‌రెడ్డి, ఎం డీ ఇస్మాయిల్, కంచర్లకుంట్ల దయాకర్‌రెడ్డి, దేశిడి శేఖర్‌రెడ్డి, తమన్న, ఆరీఫ్, టీడీపీ నాయకులు కాసుల సత్యం, మాన్యానాయక్‌ పాల్గొన్నారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top