టీఆర్‌ఎస్‌లో ఉండలేకపోతున్నా..రాజీనామాకు సిద్ధం | Bodhan MLA Shakeel Ahmed Says Ready to Quit TRS | Sakshi
Sakshi News home page

అర్వింద్‌తో అన్ని విషయాలు మాట్లాడా: షకీల్‌

Sep 12 2019 4:32 PM | Updated on Sep 12 2019 7:01 PM

Bodhan MLA Shakeel Ahmed Says Ready to Quit TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లభించడం లేదని బోధన్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌ వ్యాఖ్యానించారు. ఆయన గురువారం బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. సమావేశం అనంతరం ఎమ్మెల్యే షకీల్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న పరిస్థతుల్లో అక్కడ ఉండలేకపోతున్నానని,  రాజీనామాకు కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ దయ వల్లే ఎమ్మెల్యేగా గెలిచానని, అయితే ఆయనను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యే షకీల్‌ వ్యాఖ్యలు చేశారు. 

చదవండిటీఆర్‌ఎస్‌కు మరో ఎమ్మెల్యే షాక్‌! 

మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే షకీల్‌... కమలం గూటికి చేరతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీతో ఆయన భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అర‍్వింద్‌తో అన్ని విషయాలు మాట్లాడానని, సోమవారం అన్ని బయటపెడతానని ఎమ్మెల్యే షకీల్‌ పేర్కొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement