బీజేపీలో మరో బిగ్‌ వికెట్‌ డౌన్‌

BJP Rajasthan President Ashok Parnami Resigns - Sakshi

జైపూర్‌: మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ రాజస్తాన్‌ బీజేపీ అధ్యక్షుడు అశోక్‌ పర్నామి పదవి నుంచి తప్పుకున్నారు. ఆదర్శ్‌ నగర్‌ స్థానం నుంచి ఎమ్మెల్యేగానూ కొనసాగుతున్న ఆయన బుధవారం ఉన్నపళంగా రాజీనామా ప్రకటించడం చర్చనీయాంశమైంది. అయితే, వ్యక్తిగత కారణాల వల్లే ఆయన రాజీనామా చేశారని, ఈ మేరకు పార్టీ జాతీ అధ్యక్షుడు అమిత్‌షాకు సమాచారం ఇచ్చారని పర్నామీ వర్గీయులు తెలిపారు. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి ఎన్నికల రాష్ట్రాల్లో బీజేపీ మరిన్ని సంస్థాగత మార్పులు చేపట్టవచ్చనే భావన వ్యక్తమవుతున్నది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top