'తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతుంది' | BJP MLC Ramchandar Rao Says Dictatorial Rule In Telangana Continues | Sakshi
Sakshi News home page

'తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతుంది'

Sep 5 2019 6:00 PM | Updated on Sep 5 2019 6:02 PM

BJP MLC Ramchandar Rao Says Dictatorial Rule In Telangana Continues - Sakshi

సాక్షి, కామారెడ్డి : తెలంగాణలో కేసీఆర్‌ నియంతృత్వ పాలన కొనసాగుతుందని బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డిలో గురువారం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్‌ఎస్‌ పార్టీలో అంతర్గత వ్యవహారాలు కొనసాగుతున్నాయని, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఏర్పడబోతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని పార్టీల నుంచి బీజేపీలోకి వలసలు పెరుగనున్నాయని వెల్లడించారు. రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలతో పాగా వేయనుందని రామచందర్‌రావు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి జాతీయ బొగ్గు గనుల శాఖ స్వతంత్ర డైరక్టర్‌ మురళీధర్‌ గౌడ్‌, జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement