బాబు మానసిక స్థితి బాగా లేనట్లుంది: బీజేపీ

BJP Leader Bhanu Prakash Reddy Slams Chandrababu In Delhi - Sakshi

ఢిల్లీ: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై  జరిగిన దాడిని డ్రామాగా చిత్రీకరించడం అమానుషమని టీటీడీ మాజీ సభ్యుడు, బీజేపీ నేత భాను ప్రకాశ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో భాను ప్రకాశ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి మానసిక పరిస్థితి బాగా లేనట్లుందని అన్నారు. జగన్‌పై దాడి విచారించాల్సింది పోయి రాజకీయం చేయడం దారుణమన్నారు. 2003లో అలిపిరి బాంబు దాడి జరిగినపుడు అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయని, జగన్‌పై దాడిని ఖండించిన వైనాన్ని కూడా రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

కత్తి గనుక మెడకు తగిలి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో ఊహించుకోవచ్చునని వ్యాఖ్యానించారు. నిన్న జరిగిన ఘటనపై స్వతంత్ర వ్యవస్థ చేత విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 2019లో చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధిచెబుతారని జోస్యం చెప్పారు. విచారణ పూర్తి కాకముందే సానుభూతి కోసమే జరిగిందని డీజీపీ చెప్పడం విచారణను దారి మళ్లించడమేనని పేర్కొన్నారు. దాడికి  చేసిన వ్యక్తి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను అభిమానించే కుటుంబం అని ప్రచారం చేయడం సరికాదన్నారు.

ఎన్టీఆర్‌ కుటుంబంలోనే హరికృష్ణ ఒక పార్టీ, లక్ష్మీ పార్వతి ఒక పార్టీ, పురందేశ్వరి మరో పార్టీలో ఉన్నారు..దాడికి పాల్పడ్డ వ్యక్తి కుటుంబం అంతా ఒకే పార్టీ మద్దతు దారులని ఎలా చెబుతారని సూటిగా ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top