‘బాబుకు చంద్ర గ్రహణం స్టార్టయింది’ | BJP Leader Bhanu Prakash Reddy Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Jan 5 2019 6:12 PM | Updated on Jan 5 2019 11:33 PM

BJP Leader Bhanu Prakash Reddy Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవి మరిచి రౌడీలా ప్రవర్తిస్తున్నారని బీజేపీ నాయకుడు భానుప్రకాష్‌ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడలో బీజేపీ నాయకులు వినతిపత్రం ఇవ్వడానికి వెళితే హౌజ్‌ అరెస్ట్‌ చేయడం మంచి పద్దతి కాదని వ్యాఖ్యానించారు. 1998, 2014లో తమతో పొత్తు పెట్టుకొవడం వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు.

నరేంద్ర మోదీ లేకపోతే అధికారంలోకి ఎలా వచ్చారో చెప్పాలన్నారు. బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి మీద రౌడీల్లా దాడి చేశారు... టీడీపీ పరిపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు చంద్రగ్రహణం స్టార్ట్‌ అయ్యిందని..త్వరలోనే సైకిల్‌ చక్రాలు ఊడిపోవడం ఖాయమన్నారు. ఇచ్చిన హామీలు 90శాతం పూర్తి చేశామని, 2019లో కూడా నరేంద్ర మోదీయే ప్రధాన మంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement