‘గవర్నర్‌పై కించపరిచే వార్తలు.. క్షమాపణ చెప్పాలి’

BJP Indrasena Reddy Critics KCR Govt Over Unfair News On Governor - Sakshi

బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌ : కొత్త గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌పై ముఖ్యమంత్రి సీపీఆర్‌ఓ విషం కక్కేలా వార్తలు రాయించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగబద్ధమైన గవర్నర్‌ పదవిని కించపరిచే విధంగా వార్తలు రాయించిన సీపీఆర్‌ఓను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే క్రిమినల్‌ కేసు పెడతామని హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ రాజ్యాంగ బద్ధ పదవిని అవమానించడమేంటని అన్నారు. గవర్నర్‌ పదవిని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. సోమవారం ఇంద్రసేనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ...

‘గవర్నర్‌ పదవిని కించపరిచే విధంగా వ్యాసం ప్రచురించి.. ఆర్టికల్ చివరన ఇది నా సొంత అభిప్రాయం అని రాయించారు. ఇదంతా ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరిగింది. గవర్నర్‌ పదవి పేరును షేక్ అంటూ రాయించడం అవమానించడమే అవుతుంది. గవర్నర్‌గా తమిళిసై ప్రమాణం చేసి  24 గంటలు గడవకముందే ఈ విధమైన వ్యాసాలు రాయించారు. ఇక సర్కారియా కమిషన్‌పై ఆర్టికల్‌ రాసిన వ్యక్తికి కనీస అవగాహన లేదు. పార్టీ ఫిరాయింపులకు  పాల్పడ్డ వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చినపుడు ఎవరితో ప్రమాణ స్వీకారం చేయించావు. గవర్నర్‌తోనే కదా. గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తలు వెలువడినందుకు క్షమాపణలు చెప్పాలి. పార్లమెంటు ఎన్నికల తరువాత బీజేపీకి ప్రజల్లో మద్దతు మరింత పెరిగింది. టీఆర్‌ఎస్‌పైన కార్యకర్తలకు నమ్మకం పోయింది. చాలా సందర్భంగా టీఆర్‌ఎస్‌లో అసమ్మతి బయటపడుతోంది. ఈటల, రసమయి, నాయిని, జోగురామన్న ఇలా ఒకరి తరువాత మరొకరు బయటపడుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top