బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు

BJP Does Not Even Get A Seat In Telangana - Sakshi

హైదరాబాద్‌ : బీజేపీ నేత రాంమాధవ్‌ ఎంతగా మాట్లాడినా ఆ పార్టీకి తెలంగాణాలో స్థానం లేదని, వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీజేపీ గెలవలేదని టీఆర్‌ఎస్‌ నేతలు జోస్యం చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్‌ టీఆర్‌ఎస్‌ఎల్‌పీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు. దేశానికి 1947లో స్వాతంత్య్రం వస్తే తెలంగాణలో అట్టడుగు వర్గాలకు కేసీఆర్‌ హయాంలోనే వచ్చిందని తాను చాలా సార్లు చెప్పానని గుర్తు చేశారు. ఇపుడు కూడా చెబుతున్నా ...సబ్సిడీ గొర్రెల పథకం తెచ్చినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారని చెప్పారు. ఇప్పటి వరకు అరవై లక్షల గొర్రెల పంపిణీ చేశామని, ఇదో పెద్ద విజయమన్నారు.

గొల్ల కురుమలు, మత్స్యకారుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపింది కేసీఆరేనని స్పష్టం చేశారు. కోట్లాది చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయడంతో వెనుకబడిన కులాలకు మంచి మేలు జరిగిందన్నారు. అసెంబ్లీ స్పీకర్ ,శాసనమండలి చైర్మన్ కూడా వెనకబడిన వర్గాలకు చెందిన వారు కావడం బీసీ వర్గాల అదృష్టమని, ప్రభుత్వం బీసీ వర్గాలకు ఎన్ని కోట్ల రూపాలయినా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. బీసీలను తామే ఉద్ధరిస్తున్నట్టు కొందరు మాట్లాడుతున్నారని..కానీ వారు చేసింది ఏమీ లేదని విమర్శించారు. గొర్రెల పంపిణీ పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి హేళనగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top